19, జూన్ 2011, ఆదివారం

varanasi

వారణాసి పవిత్ర నగరాన్ని చూసే అదృష్టం ఎంతమందికి  లబిస్తుంది. కొన్ని కోట్లమంది వారణాసిని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటారు. కాని పుణ్యకాలం కాస్త వాయిదా వేయడంతో ముగుస్తుంది. నేను వరుసగా రెండు సంవత్సరాలు వారణాసిని సందర్శించాను. ఏదో పుణ్యం సంపాదించాలనే దృష్టితో నేను వారణాసిని సందర్సించలేదు. ఒక భారతీయుడుగా తప్పనిసరిగా సందంర్సించే నగరాల్లో ఒకటనే బావనతో వెళ్ళాను. వెళ్లేందుకు ఒక  కారణం వుంది. నా తండ్రి అస్తికలను కా శీ , ప్రయాగలో  పవిత్ర గంగ నదిలో కలిపి నా కర్తవ్యం నేరవేర్చుదమనుకొన్నాను. ఇందులో బాగంగా  వారాణసికి వెళ్ళాను. రెండు సార్లు ఈ నగరాన్ని చూసిన తర్వాత ఆంధ్రలో ఏ  పుణ్య క్షేత్రాలను సందర్శించాలని పించలేదు. 
వారణాసి . ఆ పేరులోనే వుంది మహిమ. నేను రెండుసార్లు వెళ్ళినప్పుడు మొత్తం ఎనిమిది రాత్రులు గడిపాను. ఈ మధ్య తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో ఈ నగరానికి వస్తున్నారు. ఆంధ్రసత్రం , కరేవేని బ్రాహ్మణా సత్రం కేదారేశ్వరి ఘాట్ వద్ద వున్నాయి. ఎంత మంది యాత్రికులు వచ్చినా ఈ నగరం తనలో ఇముడ్చుకుంటుంది. ఆంధ్రసత్రం వద్ద పగలు, రాత్రి తిరుగుతుంటే రాజమండ్రి గుండువారి వీధి వద్ద లేదా బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్లో ఉన్నట్లుగా వుంటుంది. గంగానది నుంచి వచ్చే చల్లటి గాలులు , హరహర మహాదేవ శంభో శంకర అంటూ వెళుతున్న యాత్రికుల మధ్య మనసు పరవశిస్తుంది. వారాణసిలో నిజాయితీ  ఉంది. అబద్దాలు పలకరు. సహాయం చేసే గుణం ఎక్కువ. దక్షిణాది వారి కంటే, ఉత్తరాది వారిలో దాతృత్వం ఎక్కువనిపించింది. గంగ స్నానం, చెప్పులు లేకుండా     చిన్న ఇరుకైన సందుల్లో నడుచుకుంటూ వెళ్లి కాశీ విశ్వేశ్వరస్వామి జ్యోతిర్లింగం సందర్శనం చేసుకోవడంలో వుండే ఆనందం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. . పైసా  ఖర్చు వుండదు. ప్రతి క్షణం అమూల్యమైనది. ఏదో ఒక సత్రంలో తలదాచుకోవచ్చు. అన్నపూర్ణ దేవి ఆలయంలో ఉచిత భోజనం లబిస్తుంది. ఇక ప్రతి సత్రంలో అన్నదానం . భారతదేశాన్ని వారాణసిలో చూడవచ్చు. తల్లికి మించిన దైవం మరొకటి లేదు. ఏకాదశి వ్రతానికి మించిన వ్రతం మరొకటి లేదు. గంగానది స్నానంకు మించినది మరొకటి లేదు. వారాణసికి మించిన మరో పుణ్య ప్రదేశం మరొకటి లేదు. (ఇంకా వుంది)

1 కామెంట్‌:

  1. I am planning to visit varanasi, to immerse the asthikalu of my departed father in Ganges. Please let me know more about the place, how to perform the task, formalities, accommodation etc,
    Thanks & regards
    M.Pardhasarathy
    sarathy2107@gmail.com

    రిప్లయితొలగించండి