26, జూన్ 2011, ఆదివారం

వారణాసి

వారణాసి నగరంలో రాత్రి జీవితం వైరాగ్యంగా గడుస్తుంది. గంగా హారతి చూసిన తర్వాత యాత్రికులు తమ సత్రాలకు చేరుకుంటారు. సత్రాల్లో రాత్రిళ్ళు యాత్రికులకు ఫలహారం అందిస్తారు. యాత్రికులు ఎవరూ కూడా మన  నగరాల్లో మాదిరిగా వెంటనే నిద్రపోరు. పక్కనే వున్నా గంగా నది వొడ్డుకు చేరుకుంటారు. గుంపులు గుంపులుగా చేరిన యాత్రికులు తమ అనుభవాలను చెప్పుకుంటారు. అన్ని ప్రాంతాలకు చెందినా తెలుగు వారు కులం, జాతికి అతీతంగా కలిసిపోతారు. మర్నాడు ఎక్కడికి  పోవాలో నిర్ణయానికి వస్తారు. కేదరేస్వర్ ఘాట్ వద్ద హడావుడి ఎక్కువుగా వుంటుంది. కొందరు యాత్రికులు మర్నాడు తమ నగరానికి వెళ్లిపోతామని నిట్టూర్పులు విడుస్తారు. అప్పుడే వెళ్ళిపోతున్నారా ? మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఆ రోజే వచ్చిన వారు అడుగుతుంటారు. ఆ రోజే వచ్చిన వారు ఇంకా మేము కొన్ని రోజులు వుంతమనే దీమా తో వుంటారు. వెళ్ళే వారు మాత్రం మళ్లీ వారణాసికి ఈ జన్మకు వస్తామ అనే దిగులుతో వుంటారు. అక్కర చేరిన యాత్రికుల మాటల్లో తెలియని విరక్తి కనబడుతుంది.  కొందరు కర్మలు చేసేందుకు వచ్చామంటారు. మరి  కొందరు వారణాసిని చూసేందుకు వచ్చామంటారు. మీకు కర్మలు చేన్సుడుకు  బ్రాహ్మిన్స్ ఎంత తీసుకున్నారనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడెక్కడినుంచో వచ్చినవాళ్లు అందరు రాత్రి పది గంటలకు సత్రాలకు చేరుకుంటారు. ఇంకా  ఓపిక వున్నవారు అక్కడే కూర్చుని తమ సొంత విషయాలను చెప్పుకుంటారు. ఈ మధ్య కాలంలో యుక్త వయస్సులో వున్నవారు కూడా వారాణసికి ఎక్కువుగా వస్తున్నారు. వారణాసి అంటే కేవలం కాటికి కాళ్ళు చాచిన వారు వస్తారనుకుంటే పప్పులో కాలేసినట్లే. సత్య హరిశ్చంద్ర ఘాట్లో , దూరాన మణికర్ణిక ఘాట్లో దహనమౌతున్నశవాలు , నిర్మలంగా పారుతున్న గంగానదిని చూస్తే, మనం మన నగరాల్లో ఎందుకు, ప్రతి విషయానికి తపన పడుతున్నమో , విలువైన కాలాన్ని సేవకు అంకితం ఎందుకు చేయలేకపోతున్నమో అనిపిస్తుంది. వారణాసి ని చూస్తే భయంపోతుంది. జీవితం పట్ల ఆశ పెరుగుతుంది.  (ఇంకా వుంది )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి