27, జూన్ 2011, సోమవారం

తెలంగాణా

తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు మరో  సారి కాంగ్రెస్ పార్టీ అది నాయకత్వం చేతిలో మోసబోతున్నారు. కెసిఆర్ చాలా సార్లు ఈ విషయాన్నీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నూరు శాతం తెలంగాణా ఇవ్వదని తేలి పోయింది. ఎవరిని మోసం చేసుందుకు కాంగ్రెస్ ఎంపీలు నిజాం కాలేజిలో  దొంగ ఫాష్టింగులు చేస్తారు . నేను రాజముండ్రి వాడిని. నేను ఆంధ్ర రాష్ట్రము విభజనకు వ్యతిరేకిని కాను. కాని ఏదో ఒక పరిష్కారం వెంటనే రావాలి. మన ఆంధ్రా మిత్రులు కూడా హైదరాబాద్ గురించి మనసు విప్పి మాట్లాడాలి. తెలంగాణా ప్రజలు హైదరాబాద్ ను వదులుకోవాలి. ఆంధ్రులు సమైఖ్య ఆంధ్ర ను వదులుకోవాలి. హైదరాబాద్ మీద రెండు ప్రాంతాల ప్రజలు, నాయకులూ  ఒక అవగాహన కు వస్తే వెంటనే పరిష్కారం లభిస్తుంది. అంతవరకు ఆంధ్రప్రదేశ్ రావని కాష్టం లా మండుతుంది. తెలంగాణా , ఆంధ్ర ప్రజలను విడతీసింది కాంగ్రెస్ పార్టీనే. స్వర్గలోకంలో వున్నా రంభ, ఊర్వసి , మేనక ను తెచ్చి తెల్లవార్లూ తెలంగాణా ప్రజల  ఎదుట డాన్సు వేయించిన ఏమి కావాలని అడిగితే నాకు తెలంగాణా కావలె అని అడుగుతారు. వారిలో అంత నిభాద్దత వుంది. తెలంగాణా ప్రజలు మంచివారు. సులభంగా అందరిని నమ్ముతారు. ఇప్పుడుండే పరిష్టితులు చూస్తే తెలంగాణా వస్తుందనే నమ్మకం నాలో సన్నగిల్లింది. ఇరు ప్రాంతాల నేతలు భేషిజాలు మానుకొని హైదరాబాద్ మీద ఒక అవగాహనకు వస్తే తప్పనిసరిగా తెలంగాణా ఏర్పడుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి